VIDEO: కలెక్టర్ ఆదేశాలతో తహసీల్దార్ విచారణ
WGL: రాయపర్తి మండలానికి చెందిన ఐత సమ్మక్క, కొమురయ్య దంపతులు తమ ఆస్తిని కాజేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఆవేదనతో పురుగుమందు తాగేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. జిల్లా కలెక్టర్ఆదేశాల మేరకు తహసీల్దార్ శ్రీనివాస్ నేడు గ్రామానికి వెళ్లి విచారణ నిర్వహించి, భూమి కాజేయాలని చూసిన వారిని హెచ్చరించారు.