'డిజిటల్ అరెస్ట్ చట్టంలో ఎక్కడా లేదు'
KDP: డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో ఎక్కడా లేదని, సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకూడదని 2 టౌన్ పోలీస్ స్టేషన్ CI వంశీనాథ్ తెలిపారు. సోమవారం ప్రొద్దుటూరులో రిజర్వ్ బ్యాంక్ సౌజన్యంతో హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతపై విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది.సైబర్ మోసగాళ్లు సంక్షేమ పథకాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారన్నారు.