కాంగ్రెస్ ఎమ్మెల్యే సొంతూరులో BRS గెలుపు సంబరాలు
MBNR: దేవరకద్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సొంతూరు అయిన చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్‌లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. గ్రామ సర్పంచ్‌గా BRS బలపరిచిన అభ్యర్థి పావని కృష్ణయ్య శెట్టి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి భారతీ బాలకృష్ణారెడ్డిపై పావని కృష్ణయ్య శెట్టి 126 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.