గంగూడెంలో క్షుద్ర పూజలు కలకలం
MLG: కన్నాయిగూడెం మండలం గంగూడెం గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. గ్రామంలోని కావేరి రామయ్య అనే వ్యక్తి ఇంటి ముందు కొందరు వ్యక్తులు అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేశారు. ఏకంగా ఇంటి గడప ముందు పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, దీపాలు వెలిగించి విచిత్ర పూజలు నిర్వహించడంతో గ్రామస్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పోలీసులు వెంటనే స్పందించి దుండగులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.