ఇప్పుడెందుకు ఇలా తయారైంది: కేసీఆర్
TG: తెలంగాణ వచ్చాక మిషన్ కాకతీయతో చెరువులు బాగుచేసుకున్నామని మాజీ సీఎం కేసీఆర్ చెప్పారు. మిషన్ భగీరథతో ప్రతి పల్లెకు నీళ్లిచ్చామన్నారు. నీళ్లివ్వకపోతే ఓట్లేయకండి అని అసెంబ్లీ చెప్పిన సీఎం ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. మరి ఇప్పుడెందుకు నీళ్లు రావట్లేదన్నారు. కట్టిన ఇల్లు, పెట్టిన పోయ్యే కదా.. ఇప్పుడెందుకు తెలంగాణ ఇలా తయారైందని విమర్శించారు.