మంత్రి ఆదేశాలతో యూరియా సమస్యకు పరిష్కారం

మంత్రి ఆదేశాలతో యూరియా సమస్యకు పరిష్కారం

GNTR: యూరియా అందుబాటులో లేకపోవడం వలన ఇబ్బందులు పడుతున్నామని రైతులు వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ జవ్వాది కిరణ్ చంద్‌కు తెలియజేశారు. ఆయన సమస్యను మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. మంగళవారం సంబంధిత అధికారులతో  మంత్రి చర్చించి అవసరమైన యూరియా సరఫరా జరగేలా వెంటనే ఏర్పాట్లు చేశారు. అనంతరం లారీ ద్వారా యూరియాను మంగళగిరి రైతులకు అందజేశారు.