పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ప్రకాశం: ఒంగోలు నగర పరిధిలోని 47వ డివిజన్లో లబ్ధిదారులకు గురువారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, నగర కమిషనర్ వెంకటేశ్వరరావులు పంపిణీ చేశారు. ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్ సొమ్మును అందజేసి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.