నేడు గృహ నిర్మాణ సమస్యల పరిష్కారానికి 'ఫోన్ ఇన్'
KRNL: జిల్లాలో పక్కా గృహాల లబ్దిదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఇవాళ ఫోన్ ఇన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా హౌసింగ్ పీడీ టి. చిరంజీవి తెలిపారు. ఇనుము, సిమెంటు, ఇతర నిర్మాణ సామగ్రి రాకపోయినా, ఇల్లు నిర్మించుకుని బిల్లులు పెండింగ్ ఉన్నా, PMAY 2.0 అర్బన్ గృహాలకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా లబ్ధిదారులు 08518- 257481 నంబర్‌లో సంప్రదించాలన్నారు.