'ఈనెల 14న పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి'..!
SRPT: నడిగూడెం మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఈనెల 14న జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారానికి గడువు నేడు శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తుందని, ఎంపీడీవో మల్సుర్ తెలిపారు. ఇప్పటికే ప్రచార హోరుతో మార్మోగిన గ్రామాలు నేటితో ప్రశాంతం కానున్నాయి. ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎంపీడీవో తెలిపారు.