'అనుమతులేని సెప్టిక్ ట్యాంక్ వాహనాలపై చర్యలు తీసుకుంటాం'
E.G: రాజమండ్రిలో అనుమతులు లేకుండా ప్రైవేట్‌గా సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ చేస్తున్న వాహనాలపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ యూనియన్ సభ్యులు సోమవారం ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలను వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.