'విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలి'

ASR: విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్యలింగం ఉపాధ్యాయులను సూచించారు. డుంబ్రిగుడ మండలంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో శుక్రవారం ఆయన సందర్శించి తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలో ఉన్న రికార్డులు, భోజనం మెనూను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు.. మంచిగా చదివి మంచి మార్కులు సాధించాలని విద్యార్థులకు సూచించారు.