VIDEO: ప్రభుత్వ పాఠశాలలో ప్రపంచ ధరిత్రి దినోత్సవం
NLR: విడవలూరు మండలంలోని వావిళ్ళ జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ ప్లస్ ఉన్నత పాఠశాలలో ఇవాళ ప్రపంచ ధరిత్రి దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ర్యాలీ చేశారు. ప్లాస్టిక్ వాడకూడదని స్థానికులకు సూచించారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా వస్తువులను వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం చెంచురామయ్య, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.