సైన్స్ ఒలింపియాడ్‌లో బంగారు పతకాలు
శ్రీకాకుళం ఆక్స్ ఫర్డ్ స్కూల్‌కు చెందిన 18 మంది విద్యార్థులు జాతీయ స్థాయి సైన్స్ ఒలింపియాడ్ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలు సాధించారు. సైన్స్ డే సందర్భంగా ఏసీబీ ఇన్‌స్పెక్టర్ కె. భాస్కరరావు ఈ విద్యార్థులకు బహుమతులు అందజేసి సత్కరించారు. స్కూల్ కరెస్పాండెంట్ అన్నెపు రమేష్ బాబు, సిబ్బంది విద్యార్థులను అభినందించారు.