కడపలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్
కడపలోని అన్ని పోలిస్ స్టేషన్ల పరిధిలో ఆదివారం రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని వారికి సూచించారు. నేర ప్రవృత్తికి స్వస్తి పలికి సత్ప్రవర్తనతో జీవించాలని హెచ్చరించారు. లేనిచో కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని స్టేషన్ల పోలీస్ అధికారులు పాల్గొన్నారు.