పోక్సో కేసులో సంచలన తీర్పు

పోక్సో కేసులో సంచలన తీర్పు

BDK: కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి సరిత మంగళవారం పోక్సో కేసులో సంచలన తీర్పు వెలువరించారు. టేకులపల్లి మండలం శంభునిగూడెం గ్రామానికి చెందిన మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన కుంపటి ప్రవీణ్ అఘాయిత్యానికి పాల్పడిన కేసులో 14 మంది సాక్షులను విచారించి నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 15 వేల జరిమానా విధించారు.