'గ్రామ అధికారులు జార స్పందించండి'
BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లిలోని SC కాలనీలో గత కొద్ది రోజులుగా ప్రభుత్వ బోరు మోటర్ పాడైపోయి కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగు, వంట నీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. కాలనీవాసులు స్పందించి సొంత డబ్బులతో రిపేరు చేయించుకున్నారు. కానీ మళ్లీ మోటర్ మొత్తానికే పాడైపోయింది. ఇప్పటికైనా గ్రామ అధికారులు స్పందించాలని ఇవాళ కోరారు.