కొత్తగూడలో మంత్రి సీతక్క పర్యటన

కొత్తగూడలో మంత్రి సీతక్క పర్యటన

ములుగు: కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ, ఎంచగూడెంలోని కొమ్మాలమ్మ జాతరకు హాజరై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రజలు సుభిక్షంగా ఉండాలని దైవ సన్నిధిలో కోరుకున్నట్లు తెలియజేశారు. తదనంతరం జాతర కమిటీ సభ్యులు మంత్రి సీతక్కను సన్మానించారు.