VIDEO: వరి పొలాలను పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారులు
AKP: మాడుగుల మండలం ఎం కృష్ణాపురం గ్రామంలో గురువారం వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీదేవి పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె వర్షాల వలన తడిచిపోయిన వరి పంట వివరాలను రైతుల వద్ద నుంచి అడిగి తెలుసుకున్నారు. పంట పాడవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు రైతులకు వివరించారు. ఉప్పు ద్రావణం పిచికారి చేయడం ద్వారా నష్టాన్ని నివారించవచ్చునని పేర్కొన్నారు.