VIDEO: అధికారులు జారా స్పందించండి..!
BHPL: గత ప్రభుత్వం రూ. 25 కోట్లతో నిర్మించిన కాసింపల్లి–భూపాలపల్లి ప్రధాన రహదారి సెగ్గంపల్లి ప్రాంతంలో చెత్త, ఇసుక, ఇటుకలు, కంకరలతో మూసుకుపోయింది. భూపాలపల్లి మున్సిపాలిటీ పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వల్ల రోడ్డు ఒక వైపు పూర్తిగా మూసుకుపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఓ వాహనదారుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించాలన్నారు.