VIDEO: యూరియా కోసం క్యూ కట్టిన రైతులు

CTR: యూరియా కోసం పలమనేరులోని దుకాణాల ముందు గురువారం ఉదయాన్నే రైతులు క్యూ కట్టారు. గుడియాత్తం రోడ్డులోని ఓ షాపు వద్ద 7 గంటల నుంచి బారులుదీరారు. రైతులందరూ వరినాట్లు వేయడంతో యూరియాకు డిమాండ్ ఏర్పడింది. నెల రోజులుగా యూరియా కొరత ఉందని.. అయినప్పటికీ సరఫరా తక్కువగానే చేస్తున్నారని రైతులు వాపోయారు.