అనంతబాబు బెయిల్ రద్దుపై కోర్టులో పిటిషన్

అనంతబాబు బెయిల్ రద్దుపై కోర్టులో పిటిషన్

E.G: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు చేయాలని రాజమండ్రి కోర్టులో పీపీ సుబ్బారావు పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు విధించిన నిబంధనలను ఆయన అతిక్రమించారని పేర్కొన్నారు. సాక్షులను డబ్బుతో ప్రలోభపెట్టడమే కాకుండా, చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని వివరించారు. మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన కేసులో ఆయన బెయిల్‌పై ఉన్నారు.