VIDEO: అన్న క్యాంటీన్ తనిఖీ చేసిన కలెక్టర్
KRNL: ఆదోనిలో నిర్మల్ థియేటర్ ఎదుట ఉన్న అన్న క్యాంటీన్‌ను జిల్లా కలెక్టర్ డా. సిరి ఆకస్మికంగా బుధవారం సందర్శించారు. స్వయంగా భోజనం వడ్డించి ఆహార నాణ్యతను పరిశీలించారు. పరిశుభ్రత పాటిస్తూ.. నాణ్యమైన ఆహారం అందించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అజయ్ కుమార్, తహసీల్దార్ శేషాఫణి, మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ పాల్గొన్నారు.