వెలిగండ్లలో ఓటు హక్కుపై అవగాహనా ర్యాలీ

వెలిగండ్లలో ఓటు హక్కుపై అవగాహనా ర్యాలీ

ప్రకాశం: 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమం వెలిగండ్లలో శనివారం నిర్వహించారు. గ్రామంలోని జడ్పీ హైస్కూల్ లోని విద్యార్థులతో ఓటు హక్కుపై అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సువర్ణ, ఎంఈఓ దాసు ప్రసాద్, వెలిగండ్ల సర్పంచ్ తాతపూడి సురేష్ బాబు పాల్గొని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షులు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.