ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
E.G: నల్లజర్ల మండలం అనంతపల్లి సమీపంలో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టోల్ గేట్‌కు సుమారు 500 మీటర్ల దూరంలో ఉన్న సూచిక బోర్డును ఓ కారు ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.