రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
BDK: బయ్యారం సబ్ స్టేషన్ నుంచి 11కేవీ పినపాక ఫీడర్‌లో మరమ్మతుల కారణంగా 11కేవీ ఫీడర్‌లో గల అన్ని వ్యవసాయ మోటార్లకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు త్రీ ఫేజ్ కరెంట్ ఉండదు. సింగిల్ ఫేజ్ కరెంటు మాత్రమే ఉంటుంది. కావున రైతులు సహకరించాలని విద్యుత్ శాఖ అధికారి ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు.