VIDEO: 'విద్యార్థులు చట్టాల మీద అవగాహన పెంచుకోవాలి'
AKP: నర్సీపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం న్యాయమూర్తి ఎం రోహిత్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవ హక్కులు కాపాడడానికి హ్యూమన్ రైట్స్ ఆక్ట్ ఉందని పేర్కొన్నారు. విద్యార్థి వయసులోనే అందరూ చట్టాల మీద అవగాహన పెంచుకోవాలని సూచించారు. పేదల కోసం ఉచితంగా న్యాయం అందిస్తున్నామని తెలిపారు.