ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
GDWL: జిల్లా పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మిచేడు నుంచి గద్వాల వైపు బైక్‌పై ముగ్గురు వ్యక్తులు వెళ్తుండగా, అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు గద్వాల పట్టణానికి చెందిన వారిగా సమాచారం.