తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ఏర్పాటు

ATP: తుంగభద్ర ప్రాజెక్టు ప్రస్తుత గేట్ల స్థానంలో కొత్త గేట్ల ఏర్పాటు గడువులోగా పూర్తి చేయాలని టీవీ బోర్డు అధికారులను రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలువ ఆదేశించారు. తుంగభద్ర గేట్ల భద్రతపై రైతుల్లో ఆందోళనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో శనివారం ఆయన ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.