సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి
MBNR: కాంట్రాక్టు విద్యుత్తు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని MLA యెన్నం శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లా కాంట్రాక్టు ఉద్యోగులు ఆయనను క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. విద్యార్హతను బట్టి APSEB రూల్స్ అమలు చేయాలని వారు కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన.. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.