VIDEO: కన్నుల పండుగగా లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం
అన్నమయ్య: గుర్రంకొండ మండలం తరిగొండలో TTD ఆధ్వర్యంలో జరుగుతున్న లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సోమవారం స్వామివారి రథోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. ఉదయం సుప్రభాత సేవ,దూపదీప నైవేద్యాలతో స్వామివారిని ఆరాధించిన అనంతరం, రథంపై కొలువుదీరిన స్వామివారు గ్రామ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు గోవింద నామస్మరణతో రథాన్ని లాగారు.