VIDEO: గంజాయి తరలిస్తున్న ఐదుగురి అరెస్ట్

KRNL: 20 కేజీల గంజాయిని కారులో తరలిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను ఆదివారం నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు - బళ్లారి చౌరస్తా ప్రాంతంలోని హైవేపై ఓ కారును తనిఖీ చేయగా అందులో 20 కిలోల గంజాయి పట్టుబడింది. దీంతో పంచలింగాలకు చెందిన నరేంద్రతోపాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయిని అరకు నుంచి కర్నూలుకు తరలిస్తున్నట్లు సమాచారంతో తనిఖీలు చేశామన్నారు.