VIDEO: చిన్నారుల అంత్యక్రియల్లో మిన్నంటిన రోదనలు

VIDEO: చిన్నారుల అంత్యక్రియల్లో మిన్నంటిన  రోదనలు

KMR: కన్నతండ్రి చేతిలోనే బలైన ముగ్గురు చిన్నారుల మరణం కామారెడ్డిలో పెను విషాదం నింపింది. పేదరికం సాకుతో తండ్రి ఇస్మాయిల్ ముగ్గురు కూతుళ్లను చెరువులో పడేసి చంపిన ఘటనపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఆదివారం ఆ చిన్నారులకు వారి సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. బంధువుల రోదనల మధ్య జరిగిన కార్యక్రమంలో పట్టణవాసులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.