'బ్యాంకు రుణాలు సద్వినియోగం చేసుకోవాలి'
ASR: స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంకు రుణాలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు. శుక్రవారం పాడేరులో డుంబ్రిగుడ మండలానికి చెందిన 38 స్వయం సహాయక సంఘాల లబ్ధిదారులకు బ్యాంకు ద్వారా మంజూరు చేసిన రుణాలు రూ. 2కోట్ల 10లక్షల 10వేల చెక్కును కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. రుణాలు సద్వినియోగం చేసుకుని, మహిళలు ఆర్ధికాభివృద్ది సాధించాలన్నారు.