అడవి పంది అడ్డు రావడంతో ఒకరు మృతి

అడవి పంది అడ్డు రావడంతో ఒకరు మృతి

ప్రకాశం: కురిచేడు మండలం అగ్రహారం సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. అడవి పంది అడ్డు రావడంతో కారు బోల్తా పడి హైదరాబాదుకు చెందిన నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను దర్శి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.