కూటమి ప్రభుత్వంలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత: మంత్రి

కూటమి ప్రభుత్వంలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత: మంత్రి

NDL: నంద్యాలలోని టేక్కే మార్కెట్ యార్డ్ ఆవరణలో ఆదివారం వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా మంత్రి ఫరూక్ రైతులకు వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేశారు. గోస్పాడు, నంద్యాల రైతులకు విత్తనపు గొర్రు, రోటవేటర్లు, తైవాన్ స్ప్రేయర్లు, బ్యాటరీ స్ప్రేయర్లు, కల్టివేటర్లు అందజేశారు. కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తుందని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు.