నీట మునిగిన రైల్వే అండర్ బ్రిడ్జ్

VZM: జిల్లా వేపాడ మండలం సోంపురం గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు రైల్వే అండర్ బ్రిడ్జి రోడ్డు అంతా వర్షంతో నిండిపోయింది. దీంతో అటుగా వెళ్లే 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే ఇంజనీర్ అధికారులు నిర్లక్ష్యం, నీటి ప్రవాహం అరికట్టకుండా అశ్రద్ధ చూపించడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు పోతున్నారు. శాశ్వత పరిష్కారం కోసం ప్రజలు కోరుకుంటున్నారు.