నిత్య అన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం
శ్రీకాకుళం మండలం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో నిత్య అన్నదాన పథకానికి రూ.లక్ష విరాళాన్ని పట్టణానికి చెందిన అన్నెపు రమేష్ కుటుంబ సభ్యులు ఆవాళ అందజేశారు. స్వర్గీయ అన్నపు సూర్యనారాయణ, వైకుంఠమ్మ దంపతులు జ్ఞాపకార్థం విరాళాన్ని ఆలయ కార్య నిర్వహణ అధికారి కే.ఎన్.వి ప్రసాద్ రావుకు ఇచ్చారు.