కింతాడ కళావతిని సత్కరించిన సముద్రపు రామారావు
VZM: నెల్లిమర్ల నగర పంచాయతీకి చెందిన 1వ వార్డు మాజీ కౌన్సిలర్ కింతాడ కళావతి ఆంధ్రప్రదేశ్‌లో ప్రసిద్ధిగాంచిన ద్వారకాతిరుమల దేవస్థానం బోర్డు డైరెక్టర్‌గా ఇటీవల నియమితులయ్యారు. ఈ సందర్భంగా నెల్లిమర్ల నగర పంచాయతీ మాజీ వైస్ ఛైర్మన్ సముద్రపు రామారావు ఆమెను వారి నివాసంలో కలసి శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు.