అడవులతోనే పర్యావరణ సమతుల్యత: కలెక్టర్

CTR: ఈనెల 30న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న వన మహోత్సవం కార్యక్రమంకు సంబంధించి జిల్లా అటవీ శాఖ అధికారులతో కలిసి కరపత్రాలు, పోస్టర్‌లను జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అడవుల ప్రాముఖ్యతను గురించి మన భావితరాల వారికి తెలియజేయడానికి వనమహోత్సవం కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు.