'పీఆర్సీ వెంటనే ప్రకటించాలి'

'పీఆర్సీ వెంటనే ప్రకటించాలి'

NLG: ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావాల్సిన PRCని ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలని JAC నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర JAC పిలుపు మేరకు శుక్రవారం ఉద్యోగులు, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధుల్లో పాల్గొన్నారు. 2024 నుంచి అమలు కావాల్సిన PRCని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.