నాకు చెప్పినట్టే పిచ్ తయారు చేశా: క్యూరేటర్
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఓ జట్టు 200 పరుగులు చేయలేకపోయింది. దీంతో పిచ్‌పై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. వీటిపై క్యూరేటర్ సుజన్ ముఖర్జీ స్పందించాడు. తనకు చెప్పినట్లుగానే పిచ్ తయారు చేసినట్లు తెలిపాడు. ఇందుకోసం తాను పూర్తి అంకితభావంతో పనిచేసినట్లు పేర్కొన్నాడు. అందరికీ అన్నీ తెలియవని వెల్లడించాడు.