మద్యం తాగి వాహనాలు నడిపితే జైలు: ఎస్పీ

MLG: మద్యం సేవించి వాహనాలు నడిపితే ఇకపై జరిమానాతో పాటు జైలు శిక్ష విధించబడుతుందని ఎస్పీ శబరీశ్ అన్నారు. జూలై మాసంలో జిల్లా వ్యాప్తంగా 456 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. గడిచిన వారంలో పట్టుబడిన 17 మందికి 2 రోజుల జైలు శిక్షతో పాటు, 2 వేల జరిమానా విధించమన్నారు.