స్కూల్‌కు వెళ్తుండగా కబళించిన మృత్యువు

స్కూల్‌కు వెళ్తుండగా కబళించిన మృత్యువు

GDWL: స్కూల్ బస్సు ఎక్కి పాఠశాలకు వెళ్లే బాలుడిని శనివారం అకారణంగా మృత్యువు కబళించింది. మానవపాడు మండలానికి చెందిన విష్ణుకుమార్-పార్వతమ్మ దంపతుల చిన్న కుమారుడు కార్తీక్ నాయుడు(4)ను కూలీల కోసం వచ్చిన ట్రాక్టర్ను డ్రైవర్ రివర్స్ చేస్తుండగా ఢీకొంది. దీంతో బాలుడు అక్కడికక్కడే మరణించాడు. కన్నవారికి తీరని కడుపుకోతను మిగిల్చిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.