అన్ని పార్టీల నేతలకు మోదీ కీలక పిలుపు

ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు అన్ని పార్టీలు మద్దతివ్వాలని PM మోదీ విజ్ఞప్తి చేశారు. పార్లమెంటులో జరిగిన NDA ఎంపీల సమావేశంలో మోదీ ఈ మేరకు పిలుపునిచ్చారు. ప్రజా జీవితంలో రాధాకృష్ణన్ మచ్చలేని మనిషి అని ప్రశంసించారు. రాధాకృష్ణన్ ఎన్నిక ఏకగ్రీవమయ్యేందుకు రక్షణమంత్రి రాజ్‌నాథ్ ఇతర పార్టీల నేతలతో చర్చిస్తున్నారని మోదీ తెలిపారు.