జమ్మికుంట మార్కెట్‌లో సల్పంగా పెరిగిన పత్తి ధరలు
KNR జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో బుధవారం పత్తి ధరలు స్వల్పంగా తగ్గాయి. నేడు మార్కెట్ కు మొత్తం 5 వాహనాల్లో 45 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి రాగా.. గరిష్ఠంగా రూ.7900, కనిష్ఠంగా రూ.6,500 ధర పలికింది. మార్కెట్లో కార్యకలాపాలను మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి రాజా పరిశీలించారు. అధికారులు పత్తి ధరలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు