భూపాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు వివాదం

భూపాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు వివాదం

BHPL: జిల్లా కేంద్రంలోని భాస్కర్ గడ్డ వద్ద నిర్మించిన 416 రెండు పడకల (డబుల్ బెడ్ రూమ్) ఇళ్లలో 408 ఇళ్లను ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం లాటరీ ద్వారా కేటాయించింది. గత ప్రభుత్వం లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసి ఇళ్లు ఇచ్చిందని.. ప్రస్తుతం కాంగ్రెస్ పాత జాబితాను రద్దు చేసి తమ కార్యకర్తలకే ప్రాధాన్యం ఇచ్చిందని లబ్ధిదారులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.