VIDEO: పైపులైన్ లీకేజీతో తాగునీరు వృథా
WGL: రాయపర్తి మండలం మంచినీళ్ల చెరువు బోరు వద్ద పైపులైన్లలో లీకేజీ ఏర్పడటంతో విలువైన తాగునీరు నెలల తరబడి వృథాగా పోతోంది. GP బోరు నుంచి ఓవర్‌హెడ్ ట్యాంకుకు నీటిని ఎక్కిస్తున్న క్రమంలో ఈ సమస్య తలెత్తింది. పొద్దస్తమానం బోరు పనిచేస్తున్నప్పటికీ లీకేజీ వల్ల నీరు వృథాగా పోతుండటంతో గ్రామస్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వెంటనే అధికారులు స్పందించాలని కోరారు.