వాలీబాల్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే
కోనసీమ: ఉప్పలగుప్తం(మం) గొల్లవిల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన అరిగెల శ్రీ రంగయ్య మెమోరియల్ జాతీయ స్థాయి మెన్ అండ్ ఉమెన్ వాలీబాల్ టోర్నమెంట్‌ను ఆదివారం స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఘనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని ఇస్తాయన్నారు. జాతీయ స్థాయి పోటీలను గొల్లవిల్లిలో నిర్వహించడం గర్వకారణమని తెలిపారు.