ఆ పాఠశాలలో విద్యార్థులంతా పాస్..!

ఆ పాఠశాలలో విద్యార్థులంతా పాస్..!

NDL: శ్రీశైలం మహాత్మ జ్యోతిబా పూలే ఏపీ బీసీడబ్ల్యూ రెసిడెన్షియల్ స్కూల్ బాయ్స్ విద్యార్థులు 164 మంది పదవ తరగతి పరీక్షలు రాయగా అందరూ పాస్ అయ్యారు. 80 మంది విద్యార్థులకు 500 పైగా మార్కులు వచ్చాయి. కర్నూలుకు చెందిన పి.రంజాన్ అనే విద్యార్థి 592 మార్కులు సాధించాడు. పాఠశాల ప్రధాన చార్యులు జవహర్ ఆధ్వర్యంలో పాఠశాల వద్ద అధ్యాపకులు సంబరాలు చేసుకున్నారు.