వాట్సాప్ గవర్నెన్స్‌పై ర్యాలీలను నిర్వహించాలి: కలెక్టర్

ELR: వాట్సాప్ గవర్నెన్స్‌పై ప్రజలకు విస్తృత అవగాహన కలిగించేందుకు ప్రతీ నెల 5వ తేదీన జిల్లాలోని అన్ని సచివాలయాలు పరిధిలో ర్యాలీలు నిర్వహించాలని కలెక్టర్ కే.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సోమవారం పలు కార్యక్రమాలపై అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ 9552300009 సౌకర్యాన్ని వినియోగించుకునేల చూడాలన్నారు.